Description:పుకారులు, చాడీలు, అపవాదులు, వెన్నుపోట్లు, అనేవి సాధారణంగా ఆయా వ్యక్తులపై, సమాజాలపై, మనం పని చేసేచోట, ఇతర సామాజిక స్థాయిల్లో వాటి ప్రతికూల పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండానే ప్రజలు వ్యాపింప జేస్తుంటారు. అతి చిన్నవిగా అనిపించే ఈ పుకారులు వ్యక్తులను గాయపరుస్తాయి, సమాజాలను విచ్చిన్నం చేస్తాయి, మనం పని చేసే ఆఫీసులు, సంస్థలలో పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయి ఉత్పాదకతను కోల్పోతాయి. పుకారు అనేది ఒక కలుపు మొక్క దానిని వెంటనే తొలగించకపోతే అది ఒక అందమైన తోట మొత్తాన్ని పాడు చేస్తుంది. ఈ చిన్న పుస్తకం ఆ అంశం మీద చేయబడిన ఆధ్యాత్మిక బోధను మనకు అందించి అలాంటి జీవన శైలిని వదిలించుకోడానికి సహాయం చేయడమే కాక పుకారులతో ఏవిధంగా వ్యవహరించాలో కొన్ని ఆచరణాత్మకమైన సూచనలు చేస్తుంది. ఈ పుస్తకం ఆయా సంస్థలు తమ ఆఫీసుల్లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పుకోనేలా, విద్యా సంస్థలు విద్యార్ధులతో స్నేహ పూర్వకమైన, సహాయకరమైన సంబంధాలు కలిగి ఉండేలా, సమాజాల మధ్య నివసించే వ్యక్తులు ఒకరితో ఒకరు ప్రేమపూర్వకంగా, బాధ్యతా యుతంగా వ్యవహరించేలా సహాయ పడుతుందని నా నమ్మకం. పుకారులు నశించును గాక!